19 ,20 ,21 శ్లోకం

19  శ్లోకం

Transliteration ;

వాసుదేవస్యజనకః  స  ఎవానాకాదుందుభి |

Translation ;

వాసుదేవస్యజనకః = వాసుదేవస్య +జనక =కృష్ణుని  యొక్క  తండ్రి , వసు దేవుడు ; అనఘదుందుభి=దుందుభి , వసుదేవుడు  జన్మించినప్పుడు   స్వర్గం  లో  దుందుభులు  మ్రోగినవి . అందువలన  వసుదేవుడు  అనఘదుందుభి  గా  పేరుగాంచినాడు .

20 ,21  శ్లోకం

Transliteration ;

బలభద్ర:  ప్రళమ్భజ్ఞో  బలదేవో’చ్యుతాగ్రజః

రేవతీరమణో  రామః  కామపాలో  హలాయుధాః

నీలాంబరో  రౌహిణేయోస్తలాంఖో  ముసలి  హాలీ

సంకర్షణ:  సీరపాణిః  కాళిందిభేదనో  బలః ||

Translation ;

బలభద్ర =ధారుఢ్యo  గలవాడు , శక్తిమంతుడు , బలరాముడు ; ప్రళమ్భఘ్న=  ప్రలంభ +ఘ్న=ప్రలంభ  అనే  దానవుని  చంపినవాడు ,బలరాముడు ; బలదేవ =వాయువు  అంత  బలం  కలిగిన  వాడు , బలరాముడు ; అచ్యుతాగ్రజః = అచ్యుత+అగ్రజ =కృష్ణుని పెద్ద అన్నగారు , బలరాముడు ;రేవతిరమణ= రేవతి+రమణ=రేవతి +పతి=రేవతి యొక్క పతి, బలరాముడు ; రామః =  బలరాముని  విష్ణువు  8 వ అవతరంగా  కూడా  భావిస్తారు . విష్ణువు  యొక్క  అంశ  మొదట  బలరాముని  లో  ప్రవేశించి  తరువాత  కృష్ణునిగా  విస్తరించింది . బలరాముని  లో  ఆదిశేషుని  అంశ  కూడా ఉన్నది ; కామపాలః=కామ+పాల= కొరికలు+తీర్చుట = కోరికలు  తీర్చేవాడు , బలరాముడు ; హలాయుధః=హల+ ఆయుధం=నాగలి ని  ఆయుధం  గా  ధరించేవాడు , బలరాముడు ; నీలాంబర:=  నీల+అంబర=నీల+దుస్తులు=నీలపు  రంగు  దుస్తులు  ధరించేవాడు, బలరాముడు ; రౌహిణేయ = వసుదేవుని  రెండవ  భార్య  రోహిణి  పుత్రుడు , బలరాముడు ; తాళంక:= తాళ  పత్రం  యొక్క  చిహ్నం  ధరించేవాడు ,    బలరాముడు ; ఆయన  రథం  యొక్క  ద్వజమ్  పేరు  తాళంక  ధ్వజం ;ముసలి  =ముసలం  ధరించేవాడు , బలరాముడు ; హలి=హలం  ను  పట్టుకునేవాడు , బలరాముడు ; సంకర్షణ=గర్భము  మార్పిడి  చేయుట , దేవకీ  యొక్క  7 వ  గర్భమును  విష్ణుమాయ  చేత  వసుదేవుని  రెండవ  భార్య అయిన  రోహిణి దేవి ( రోహిణి  బృందావనలో  నంద , యశోద  దంపతుల  దగ్గర  ఉన్నప్పుడు ) గర్భములో  ప్రవేశపెట్టబడింది . అందువలన   బలరాముడు  సంకర్షణ  అనే  పేరు  తో  పిలవబడుతున్నాడు . ఈ  బాలుడు  తెల్లగా  ఉన్నoదువలన   రామ  అని , బలవంతుడగుటవలన  బలరాముడు  అని  పిలవబడుతున్నాడు . గోకులం లోని  యశోదాదేవి  దగ్గరకు  పంపబడ్డ   దేవకీ  కి  జన్మించిన  8 వ  బాలుడు  , నలుపుగా  ఉండుటవలన  , కృష్ణుడు ( నలుపు ) గా  పేరుగాంచాడు ;సీరపాణి = సీర+పాణి =నాగలి+చెయ్యి = చేతితో  నాగలి  పట్టుకున్నవాడు , బలరాముడు ;  కాళిందిభేదనః=కాళింది+భేదన=కాళింది ( యమున ) నది +భేదించుట  లేక  పక్కకి  తిప్పుట , బృందావనం  దగ్గర  కాళింది  నదిని  భేదించిన  వాడు , బలరాముడు ; బలః= చాలా  బలంగల  వాడు .

Leave a comment